breaking news
kona
-
సంజన... ఐరన్ మ్యాన్
అత్యంత ఓర్పు నేర్పులతో మానసిక, శారీరక సామర్థ్యాలను ఉక్కు సంకల్పంతో పరిరక్షించుకుంటూ ఏదైనా సాధించగలం అని నిరూపిస్తోంది బొమ్మినేని సంజనారెడ్డి. ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు అర్హత సాధించిన ఈ హైదరాబాద్ వాసి ‘సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధ్యమే!’ అంటున్నారు.ఈ ఏడాది అక్టోబర్‌లో హవాయిలోని కోనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐరన్‌మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు అర్హత సాధించారు బొమ్మినేని సంజనారెడ్డి. 18–24 ఏళ్ల విభాగంలో ఆమె ఈ స్థానాన్ని సాధించారు. గత జూన్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన అల్ట్రా–ఎండ్యూరెన్స్ ట్రయాథ్లాన్‌ను 15 గంటల 22 నిమిషాల 13 సెకన్లలో పూర్తి చేశారు. లండన్‌లో అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎంఎసీ చేస్తున్న సంజన ప్రస్తుతం హైదరాబాద్‌లోనే శిక్షణ తీసుకుంటున్నారు. ఐరన్మ్యాన్లో తన అడుగు ఎలా మొదలయ్యిందో వివరించారు.కఠినమైన శిక్షణ‘‘స్కూల్ టైమ్‌లో నేనూ మా చెల్లెలు స్విమ్మింగ్ క్లాసులకు వెళ్లేవాళ్లం. స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. డిగ్రీ చేయడానికి యూకే వెళ్లాను. థర్డ్ ఇయర్లో ఐరన్‌మ్యాన్ గురించి తెలిసి, శిక్షణ తీసుకున్నాను. మాస్టర్స్ కూడా యుకెలోనే. శిక్షణ తీసుకుంటూ గత జూన్‌లో ఆస్ట్రేలియాలోని కైర్న్స్లో జరిగిన ఐరన్మ్యాన్లో పాల్గొన్నాను. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఈ మూడూ నిర్ణీత టైమ్‌లో పూర్తి చేయాలి. వరల్డ్ ఐరన్ మ్యాన్ 1978లో ఆరంభం అయింది. అయితే, ఇప్పటివరకు మన దేశం నుంచి నా ఏజ్ క్యాటగిరీలో ఎంపిక అయిన వారిలో నేనే మొదటి స్థానంలో ఉన్నాను. మొదట వారానికి 20 గంటలు, రోజూ 3–4 గంటలు ట్రైనింగ్ ఉంటుంది. రేస్ టైమ్ దగ్గర అవుతున్న కొద్దీ ట్రైనింగ్ సమయం పెరుగుతుంది. యూకేకి చెందిన కోచ్ ద్వారా ఆన్లైన్లో సూచనలు తీసుకుంటూ రోజుకు ఐదు నుండి ఆరు గంటలు శిక్షణ తీసుకుంటున్నాను.తప్పుకోవాలనుకున్న క్షణాలూ తప్పలేదు!మొదట్లో కఠిన సాధన వల్ల రేసు నుండి తప్పుకోవాలనిపించిన క్షణాలు చాలా ఉన్నాయి. కానీ లక్ష్యం ఐరన్ మ్యాన్ ను పూర్తి చేయడం మాత్రమే కాదు, ప్రారంభించిన దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకే అడుగు వేశాను. ఈ అడుగు మరికొందరికి ప్రేరణగా మారాలి అనుకున్నాను. సౌకర్యమైన జీవనంలో ఉంటే మన సామర్థ్యాలు ఏవీ తెలియవు. ఈ రోజుల్లో దాదాపు అందరం చాలా సౌకర్యాలకు అలవాటుపడిపోతున్నాం. అది ఓవర్ అవుతుంది కూడా. దీనివల్ల మన మీద మనకే కాదు, ఎదుటివారి మీద కూడా గౌరవం రాదు. మనలో ఎంతటి శక్తి ఉందో గుర్తించాలి. ఆ శక్తిని వెలికి తీయడానికి నిరంతరం ప్రయత్నించాలి. అప్పుడే మనమేంటి.. అన్నది తెలుస్తుంది. ఒకసారి మనమా శక్తిని గ్రహించగలిగామంటే మనపై మనకే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మహిళగా అది చాలా ముఖ్యం. నేనేం సాధించాలో తెలుసుకునే బ్రేకింగ్ పాయింట్‌కు చేరుకోవాలనుకున్నాను. చాలావరకు మన చుట్టూ ఉన్నవారే తొక్కేయడానికే చూస్తుంటారు. వాటిని అడ్డుకుంటూనే నాలో ఆత్మవిశ్వాసం, సాధికారతను గుర్తించాను.వ్యాపారంలోనూ రాణించాలని..మహిళగా ఈ రేస్‌లో పాల్గొనడానికి పీరియడ్స్ టైమ్ అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందికి చాలా నొప్పి, క్రాంప్స్ వస్తాయని విన్నాను. నాకు అలా ఏమీ కాలేదు. ఆస్ట్రేలియాలో జరిగిన రేస్‌లో పీరియడ్స్ టైమ్‌లోనే పాల్గొన్నాను. ఏమీ ఇబ్బంది అనిపించలేదు. మానసిక, శారీరక ప్రయోజనాలు క్రీడల్లోనే సాధించగలమని తెలుసుకున్నాను. స్పోర్ట్స్‌లో మనం రొటీన్ ఫుడ్ తీసుకుంటే ఇబ్బంది పడతాం. ఎనర్జీ బేస్డ్ సప్లిమెంట్స్ తప్పనిసరి అవసరం. దీంతో ఇండియాలో స్పోర్ట్స్ సప్లిమెంట్ బిజినెస్ రంగంలో రాణించాలని ఆలోచన కలిగింది. అమ్మానాన్నలు వెంకట్‌రెడ్డి, స్వప్న ఇద్దరూ వ్యాపార రంగంలోనే ఉన్నారు. కూతుళ్లమైనా మా ఆలోచనలను పాజిటివ్‌గా తీసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి స్కేటింగ్, టెన్నిస్, తైక్వాండ్, భరతనాట్యం... సాధన చేస్తూ ఉన్నాను. వీటితో పాటు చేసిన స్విమ్మింగ్ ఐరన్‌మ్యాన్ వరకు తీసుకెళ్లింది. ఈ విషయంలో అమ్మ నన్ను చాలా ఫుష్ చేశారు. ఈ రేసులో పాల్గొనే అమ్మాయిలు 20 శాతం వరకే ఉన్నారు. ఇండియాలో ఆరేడేళ్లుగా హాఫ్ ఐరన్‌మ్యాన్ జరుగుతోంది. గోవాలో జరిగే ఈ ఈవెంట్లో పాల్గొనేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. మన దేశంలో ఫుల్ ఐరన్‌మ్యాన్ వస్తే చాలా మంది అమ్మాయిలు ఈ రేసులో పాల్గొని తమని తాము నిరూపించుకునే అవకాశం ఉంది’’ అని తెలిపారు సంజన. – నిర్మలారెడ్డి -
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది
గౌహతి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘హ్యుందాయ్’ అతిత్వరలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ‘కోనా’ పేరుతో ఈ కారు జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది. చెన్నైలోని ఉత్పత్తి ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ కారు అసెంబ్లింగ్ జరుగుతోందని ఇక్కడి అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) బుధవారం ఒక ప్రకటన చేసింది. ఈ అంశంపై మాట్లాడిన సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్, గ్రూప్ హెడ్ (మార్కెటింగ్) పునీత్ ఆనంద్.. ‘భారత రోడ్లపై హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు దూసుకురానుంది. మరోవైపు పండుగ సీజన్లో గ్రాండ్ ఐ10 నూతన మోడల్‌ను ప్రవేశపెట్టనున్నాం. కాంపాక్ట్ ఎస్యూవీ ‘వెన్యూ’ కారుకు 20,000 బుకింగ్స్ పూర్తయ్యాయి. ఈ కారు నిరీక్షణ కాలం 3–4 నెలలుగా ఉంది. చెన్నై ప్లాంట్‌లో నెలకు 7,000 వెన్యూ కార్ల ఉత్పత్తి జరుగుతుండగా.. దీనిని 10,000కు పెంచనున్నాం’ అని చెప్పారు. -
తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత
-
తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత: వైఎస్ జగన్
కోన: ఇష్టం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే తన్నితరిమిన చరిత్ర కోన గ్రామానికి ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాంటిది పోర్టు పేరుతో బలవంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటివాడని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల ఆస్తులు లాక్కుని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరే రాష్ట్రానికి ఉండడని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం బందర్ పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. గతంలో ఎన్నికల సమయంలో కోనకు వచ్చిన చంద్రబాబు నాలుగువేల ఎకరాలు ఎందుకు 1800 ఎకరాల్లో పోర్టు కట్టిస్తామని అన్నారని, కానీ ఇప్పుడు మాత్రం ప్రజలతో ఆటలాడుకుంటూ నాలుగువేల ఎకరాలు సరిపోదని 30 వేల ఎకరాలు అని చెప్పి.. మరోసారి మాటమార్చి ఏకంగా లక్షా ఐదువేల ఎకరాలు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలయినంత తక్కువ భూముల్లో పోర్టు కట్టించాలని, మిగితా భూములు రైతులకే వదిలిపెట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పోర్టు పేరుతో అధికంగా భూములు తీసుకొని వేరే వాళ్లకు అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ ఒక దారుణమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతభూమిని లాక్కుని వారికి వెయ్యి గజాలు మాత్రం ముష్టి వేస్తారని చంద్రబాబు అంటున్నారని, దీనిని ఎలా సమర్థించాలని నిలదీశారు. రైతులకు అతి ఆశ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎకరాకు రూ.30 వేలు పదేళ్లపాటు ఇస్తానని చంద్రబాబు అని, చివరకు అవి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.30 నుంచి రూ.50లక్షల ధర ఉంటే వేలు ఇచ్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు అసైన్డ్ భూములంటే చాలా చులకన అని, పేదవానికి అసైన్డ్ భూములిచ్చినప్పుడు మరింత భూములిచ్చి వారిని ఆదుకోవాల్సింది పోయి ఇష్టమొచ్చినప్పుడు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. ఇక్కడ భూములకు కాలువ నీళ్లిచ్చే పరిస్థితి లేదని, బ్యాంకుల నుంచి క్రాప్లోన్లు కూడా ఇవ్వకుండా కట్టడి చేస్తూ రైతులపై కక్షపూరిత చర్యలు చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత అవసరాలకోసం భూములు కూడా అమ్ముకోనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన ఇక మరెంతకాలమో సాగదని అన్ని సక్రమంగా ఉంటే రెండేళ్లేనని, దేవుడు దీవిస్తే మరో ఏడాదిలోనే బంగాళఖాతంలో కలుస్తుందని వైఎస్ జగన్ చెప్పారు. త్వరలోనే ప్రజల ప్రభుత్వం వస్తుందని, అందరి భూములు భద్రంగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. -
తేనెటీగల దాడి: 11 మందికి గాయాలు
యాడికి : మండలంలోని కోనలో తేనెటీగల దాడిలో 11 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యాడికిలోని ఓంశాంతి కాలనీకి చెందిన వెంకటలకు్ష్మమ్మ కుటుంబ సభ్యులు తాడిపత్రికి చెందిన తమ బంధువులతో కలసి విహార యాత్ర నిమిత్తం కోనకు వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. అక్కడ మధ్యాహ్నం భోజనానంతరం పిల్లలు ఆడుకుంటూ తుట్టపై రాళ్లు రువ్వడంతో తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేసినట్లు వివరించారు. గాయపడ్డ వారిలో వెంకటలక్షు్మమ్మ(65) పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే ఆమెను తాడిపత్రికి తరలించినట్లు వివరించారు. -
మంత్రి, ఎంపీలను తరిమికొట్టిన గ్రామస్తులు
-
మంత్రి, ఎంపీలను తరిమికొట్టిన గ్రామస్తులు
మచిలీపట్నం: బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణకు గ్రామస్తులను ఒప్పిస్తామంటూ వెళ్లిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణలను గ్రామస్తులు తరిమికొట్టారు. పచ్చటి పంట పొలాలను కూడా భూసేకరణ జాబితాలోకి చేర్చి.. పొలాలు ఇవ్వడానికి రైతులను ఒప్పిస్తామని మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణ సర్వే సిబ్బందితో కలిసి శనివారం బందరు మండలంలోని కోన గ్రామానికి వెళ్లారు. అయితే, రెండు మూడు పంటలు పండే పచ్చటి పొలాలను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి, ఎంపీ కలిసి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, అసలు మీరు మా గ్రామానికి వచ్చే సాహసం ఎలా చేశారంటూ రైతులు, గ్రామస్తులు వాళ్ల మీద తిరగబడ్డారు. వాళ్లను మాట్లాడనివ్వకుండా గ్రామంలోంచి తక్షణం వెళ్లిపోవాలంటూ తిరగబడ్డారు. అలా గ్రామ పొలిమేరల వరకు నేతలను రైతులు తరిమికొట్టారు. ఈ సమయంలో మంత్రి రవీంద్ర పీఏ హరిబాబు రైతులను నివారించే ప్రయత్నం చేయడంతో.. వాళ్లు ఆయనపై తిరగబడ్డారు. ఈ ఘటనలో హరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు మంత్రి, ఎంపీ గ్రామస్తుల ఆగ్రహానికి తలవంచి వెళ్లిపోయారు. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.