భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య పుట్టింటికి వెళ్లిందని..
Sep 9 2016 12:16 PM | Updated on Aug 1 2018 2:10 PM
ఇల్లందు: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్టేషన్‌బస్తీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివామసముంటున్న పొన్నెకంటి నవీన్(24)కు ఏడాది క్రితం వివాహం అయింది. దంపతుల మధ్య వివాదాలు తలత్తెడంతో.. భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


