యువ రైతు బలవన్మరణం | young farmer commits suicide in warangal rural district | Sakshi
Sakshi News home page

యువ రైతు బలవన్మరణం

Oct 15 2016 12:42 PM | Updated on Oct 1 2018 2:36 PM

వరంగల్ రూరల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఓ యువరైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఓ యువరైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఎన్కమూరి ప్రశాంత్(24) శుక్రవారం రాత్రి పత్తి చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. శనివారం ఉదయమైనా అతడు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. తనకున్న మూడెకరాల్లో వేసిన పంటలు ఆశాజనకంగా లేక, రూ.1.70 లక్షల వరకు ఉన్న అప్పులు తీర్చేదారి కానరాకే అతడు ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబసభ్యులు అంటున్నారు.

 farmer suicide, debts, prasanth, యువరైతు, ఆత్మహత్య, ప్రశాంత్, 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement