డెంగీతో జ్వరంతో బాధపడుతున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
డెంగీతో మహిళ మృతి
Nov 24 2016 3:17 PM | Updated on Sep 4 2017 9:01 PM
దుగ్గొండి: డెంగీతో జ్వరంతో బాధపడుతున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం ఆదిలక్ష్మీపూరం గ్రామానికి చెందిన సంప ఎల్లమ్మ(30) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. డెంగీ వచ్చిందని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది.
Advertisement


