అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య
Oct 1 2016 3:02 PM | Updated on Sep 4 2017 3:48 PM
కే.సముద్రం: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా కె.సముద్రానికి చెందిన హేమలత(26) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో కె. సముద్రంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన హేమలత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement