టీచర్ ను హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో కుట్టేశాడు | Woman teacher murdered by lover in rayachuru rural area | Sakshi
Sakshi News home page

టీచర్ ను హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో కుట్టేశాడు

May 4 2016 9:25 PM | Updated on Jul 30 2018 8:29 PM

టీచర్ ను హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో కుట్టేశాడు - Sakshi

టీచర్ ను హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో కుట్టేశాడు

ఏడు సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న పాపానికి ప్రేమకు అధ్యాపకురాలు బలైంది. జిల్లాలోని మాన్వి తాలూకా సిరవారలోని బయలు

రాయచూరు రూరల్ : ఏడు సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న పాపానికి ప్రేమకు అధ్యాపకురాలు బలైంది. జిల్లాలోని మాన్వి తాలూకా సిరవారలోని బయలు ప్రదేశంలో ప్రేమికుడు ప్రియురాలిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. 7 సంవత్సరాలు గాఢంగా ప్రేమించిన ప్రేమికుడు వీరేశ అధ్యాపకురాలు ఫర్జాన్‌ను హత్య చేశాడు. గత నెల 21న సిరవారలోని బయలు ప్రదేశంలో ప్లాస్టిక్ సంచిలో శవాన్ని గుర్తించారు. అధ్యాపకురాలు ఫర్జాన్ ఎంఎస్‌సీ బీఈడీ చదివి లింగసూగూరులోని అంబేడ్కర్ కళాశాలలో విధులు నిర్వహిస్తుండేది.

ఏడాది క్రితం జావేద్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న వీరేశ 7 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న ఫలితం లేకపోయిందని, తనకు దక్కని అధ్యాపకురాలు ఫర్జాన్ మరొకరికి దక్కకూడదని భావించి ఆమెను హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో కుట్టి పారవేశాడు. వీరేశ్ తెలంగాణలోని గద్వాల వద్ద తన మొత్తం దుస్తులు సాక్ష్యం లేకుండా చేసి సోలాపూర్‌కు బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న సిరవార ఎస్‌ఐ సణ్ణమని ఆధ్వర్యంలో హంతకుడు వీరేష్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement