పట్టపగలు భార్య మెడ నరికి.. | wife-killed-by-husband in west godavari | Sakshi
Sakshi News home page

పట్టపగలు భార్య మెడ నరికి..

Oct 21 2016 11:32 AM | Updated on Sep 4 2017 5:54 PM

అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

చింతలపుడి : అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతుందని అనుమానించిన భర్త పట్టపగలు అందరుచూస్తుండగా.. గొడ్డలితో ఆమె మెడ నరికి కిరాతకంగా చంపాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఊటసముద్రంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్‌రావు, జగదీశ్వరి(30) దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది.
 
భార్య వేరే వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందని భర్త అనుమానించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన లక్ష్మణ్ పామాయిల్ మట్టలు నరికే గొడ్డలితో భార్య మెడపై వేటు వేసి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోతానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement