పాక్లో మోదీ స్వచ్ఛభారత్: సెహ్వాగ్ | virender sehwag tweet on surgical strike | Sakshi
Sakshi News home page

పాక్లో మోదీ స్వచ్ఛభారత్: సెహ్వాగ్

Sep 30 2016 10:32 AM | Updated on Sep 4 2017 3:39 PM

పాక్లో మోదీ స్వచ్ఛభారత్: సెహ్వాగ్

పాక్లో మోదీ స్వచ్ఛభారత్: సెహ్వాగ్

సర్జికల్ స్ట్రైక్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దైన శైలి లో స్పందించారు.

తన బ్యాటింగ్ లాగానే.. ట్విట్టర్ లో కూడా విలక్షణంగా ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. సర్జికల్ స్ట్రైక్ పై తన దైన శైలి లో స్పందించారు.  భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సరిహద్దులు దాటి పొరుగు దేశంలో కూడా మొదలు పెట్టారంటూ ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత సైన్యం అక్కడి ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేశారు. ఈ మధ్య కాలంలో తరచు ట్విట్టర్ ద్వారా తన భావాలను బయట పెడుతున్న సెహ్వాగ్ ప్రధాని నరేంద్రమోదీ భారత సరిహద్దులు దాటి పొరుగు దేశంలో స్వచ్ఛ భారత్‌ను మొదలుపెట్టారని అందులో భాగంగానే భారత సైన్యం ఈ దాడులు జరిపిందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement