వేట్టైయన్ కాదు | Vettaiyan is not the title of Vishal's film | Sakshi
Sakshi News home page

వేట్టైయన్ కాదు

Feb 13 2015 2:28 AM | Updated on Sep 2 2017 9:12 PM

వేట్టైయన్ కాదు

వేట్టైయన్ కాదు

తన తాజా చిత్రానికి వేట్టైయన్ అనే టైటిల్‌ను ఖాయం చేయలేదంటున్నారు నటుడు, నిర్మాత విశాల్. పాండియనాడు ఫేమ్ సుశీంద్రన్

 తన తాజా చిత్రానికి వేట్టైయన్ అనే టైటిల్‌ను ఖాయం చేయలేదంటున్నారు నటుడు, నిర్మాత విశాల్. పాండియనాడు ఫేమ్ సుశీంద్రన్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు. ఈ చిత్రాన్ని తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుండగా సత్యం, వెడి చిత్రాల తరువాత మరోసారి పోలీసు అధికారిగా నటించడానికి విశాల్ రెడీ అవుతున్నారు. షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభించి ఏకబిగువన పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇంతకుముందు కావల్‌కోట్టం అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు, తాజాగా వేట్టైయన్ పేరును పెట్టినట్లు ప్రచారం మొదలైంది. అయితే  చిత్రానికి ఇంతవరకు పేరే ఖరారు చేయలేదని నటుడు విశాల్ స్పష్టం చేశారు. అయితే వేట్టైయన్ టైటిల్‌ను చంద్రముఖి దర్శకుడు వి.వాసునే రిజిష్టర్ చేసినట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement