పద్మప్రియ రీ ఎంట్రీ

పద్మప్రియ రీ ఎంట్రీ


నటి పద్మప్రియ సెకండ్ ఇన్నింగ్‌కు రెడీ అయ్యింది. ఇంతకు ముందు మృగం, పొక్కిషం, సత్తం పోడాదే తదితర తమిళ చిత్రాల్లో నటించిన ఈ మలయాళ భామ ఆ మధ్య పై చదువుల కోసం అంటూ అమెరికా వెళ్లి నటనకు దూరమైంది. పనిలో పనిగా అక్కడ తనతోపాటు చదువుతున్న యువకుడిని ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకుని వచ్చింది. అంతకుముందు సత్తం పోడాదే చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శకుడు వసంత్ పద్మప్రియ సెకండ్ ఇన్నింగ్ ఛాన్స్ కల్పించారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శివరంజని యుం ఇన్నుం సిల పెంగుళు చిత్రంలో పద్మప్రియ నాయికగా నటిస్తున్నారు. ఆమెకు జంటగా నటుడు కరుణాకరన్ నటిస్తుండగా మరో రెండు కథా నాయికల పాత్రలో పార్వతి మీనన్, రామన్‌నంబీశన్‌లను ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైందట. ఇది మహిళా ఇతివృత్తంతో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత కథా చిత్రం అని తెలిసింది. త్వరలోనే చిత్రం పూర్తి వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top