ఉత్తమ్కుమార్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్ | trs mlc bhupathi reddy takes on uttam kumar reddy | Sakshi
Sakshi News home page

ఉత్తమ్కుమార్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్

Oct 8 2016 12:18 PM | Updated on Sep 19 2019 8:44 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిప్పులు చెరిగారు.

నిజామాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం నిజామాబాద్లో భూపతిరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందుకే ఉత్తమ్కుమార్ పంటనష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారని విమర్శించారు.

రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని భూపతిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement