కాబోయే దంపతుల్లో కలతలా? | Trisha-Varun: Trouble In The Engaged Romance? | Sakshi
Sakshi News home page

కాబోయే దంపతుల్లో కలతలా?

Apr 27 2015 2:29 AM | Updated on Sep 3 2017 12:56 AM

కాబోయే దంపతుల్లో కలతలా?

కాబోయే దంపతుల్లో కలతలా?

ఇద్దరు సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమం కూడా జరుపుకుని నాలుగు నెలలు దాటినా వివాహ

 ఇద్దరు సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమం కూడా జరుపుకుని నాలుగు నెలలు దాటినా వివాహ తేదీని నిర్ణయించుకోకపోవడంతో ఆ జంటపై సహజంగానే రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం నటి త్రిష, వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్‌మనియన్‌ల గురించి అలాంటి ప్రచారమే కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమల ప్రముఖ కథానాయకి నటి త్రిష. ఈ రంగంలో పుష్కరకాలం పూర్తి చేసుకున్న హీరోయిన్ ఆమె. యువ సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్‌మణియన్. వీరిద్దరి మధ్య ప్రేమ అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.
 
 అంతే ఆశ్చర్యంగా వివాహ నిశ్చితార్థం వరకు వెళ్లింది. ఆ వేడుక సందర్భంగా చిత్ర ప్రముఖులకు నక్షత్ర హోటల్‌లో బ్రహ్మాండమైన పార్టీని ఇచ్చారీ జంట. ఇక ఇరువర్గాల కుటుంబీకులు కలిసి పెళ్లికి మంచి ముహుర్తం నిర్ణయిస్తారని చెప్పారు. వరుణ్‌మణియన్, త్రిష వివాహ నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగింది. మార్చిలో వివాహం తంతు జరుగుతుందనే ప్రచారం జరిగింది. దీంతో త్రిష నటనకు స్వస్తి చెబుతారని, కాదు ఆమె వివాహానంతరం నటనను కొనసాగిస్తారంటూ పలు రకాల ప్రచారాలు దుమ్మురేపాయి. అయితే వీరి నిశ్చితార్థం జరిగి నాలుగు నెలలు అయ్యింది. ఇప్పటి వరకు పెళ్లి తేదీ ఖరారు కాలేదుకదా ఊసే లేదు.
 
 మనస్పర్థలా: ఇలాంటి పరిస్థితిలో త్రిష, వరుణ్ మణియన్‌ల గురించి చాలా వదంతులు ప్రచారంలో కొచ్చాయి. అందులో త్రిష, వరుణ్‌మణియన్‌ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయన్నది ఒకటి. వీరిద్దరు సోషల్ నెట్‌వర్క్సులో తరచూ తమ అభిప్రాయాలను పంచుకునేవారు. అలాంటిది గత నెల నుంచి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదట.  మరో విషయం ఏమిటంటే నిశ్చితార్థంలో వరుణ్‌మణియన్ తొడిగిన ఉంగరం త్రిషే వేలికిప్పుడు కనిపించడం లేదట. మరో విషయం వరుణ్‌మనియన్ నిర్మించనున్న తాజా చిత్రంలో మొదట నటించడానికి అంగీకరించిన త్రిష ఆ తరువాత ఆ చిత్రం నుంచి వైదొలిగారనే ప్రచారం హోరెత్తింది.  ఇలాంటి పరిస్థితిలో వరుణ్‌మణియన్, త్రిషల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపిన విషయం నిజమేనని వారి సన్నిహిత వర్గాల సమాచారం.
 
 అవకాశాలు వెల్లువ : త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్‌మణియన్‌గాని నోరు మెదపక పోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement