జీరో సైజ్‌కు త్రిష | Trisha Lost Weight For Nayaki | Sakshi
Sakshi News home page

జీరో సైజ్‌కు త్రిష

Dec 12 2015 5:36 AM | Updated on Sep 3 2017 1:50 PM

జీరో సైజ్‌కు త్రిష

జీరో సైజ్‌కు త్రిష

అందం అనేది ఆకారాన్ని బట్టి కాదు. మనసును బట్టి ఉంటుందంటారు. అది నిజమే

అందం అనేది ఆకారాన్ని బట్టి కాదు. మనసును బట్టి ఉంటుందంటారు. అది నిజమే అయినా మన కథానాయికలు మాత్రం బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత నిస్తుంటారు. ఈ విషయంలో వారిని తప్పు పట్టడం భావ్యం కాదు. కారణం అభిమానులు వారి నుంచి అందాన్నే కోరుకుంటారు. అది దాటి నటి అనుష్క లాంటి అతి కొద్దిమంది మాత్రమే పాత్రల కోసం బరువు పెరగడం, తగ్గడం లాంటివి శ్రమతో కూడుకున్నవి అయినా రిస్క్ తీసుకుని చేస్తుంటారు.
 
  నిజం చెప్పాలంటే ఇలాంటివి హీరోలే చేస్తుంటారు. తాజాగా చెన్నై సుందరి త్రిష జీరో సైజ్‌కు మారే ప్రయత్నంలో ఉన్నారు. ఈ బ్యూటీ ఏమంత లావు కాదు. మూడు పదుల వయసు మీద పడుతున్నా సన్నగా, నాజుగ్గానే బాడీని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. తాజాగా నటిస్తున్న నాయకి చిత్రం కోసం మరింత సన్నబడుతున్నారు.
 
 ఈ ద్విభాషా చిత్రంలో అమ్మడు లేలేత అందాల చిన్నదిగాను, 30 ఏళ్ల పైబడ్డ ప్రౌఢగాను ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్ర కోసం జీరో సైజ్ అందాలతో మెరవడానికి సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గ కసరత్తులతో ఇప్పటికే మునుపటి కంటే ఐదు కిలోల బరువు తగ్గారట. ఇకపై కూడా మరింత బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement