
నెట్‌లో ఆలింగనం ఫొటో
ఈ మధ్య ఇంటర్‌నెట్‌లో ఆలింగన దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ తారల సాన్నిహిత్య దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కారణం పార్టీలు, పబ్‌ల సంస్కృతి పెరగడమే.
ఈ మధ్య ఇంటర్‌నెట్‌లో ఆలింగన దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ తారల సాన్నిహిత్య దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కారణం పార్టీలు, పబ్‌ల సంస్కృతి పెరగడమే. ఆ మధ్య సంచలన నటుడిగా పేరొందిన శింబు, హన్సికలు ప్రేమలో పడి నైట్‌క్లబ్‌ల్లో ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో ప్రచారమై కలకలం రేపాయి. ఆ తరువాత వారి లవ్ బ్రేక్ అప్ అయ్యింది.
తాజాగా ధనుష్, త్రిష ఆలింగన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ధనుష్, త్రిష ఇప్పటి వరకు ఏ చిత్రంలోనూ కలసి నటించలేదు. అయినా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. త్రిష తరచూ ధనుష్‌తో ఫోన్‌లో మాట్లాడుతారనే ప్రచారం ఉంది. ఇటీవల ధనుష్, త్రిష నైట్‌పార్టీలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఇరువురు మనసులు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తరువాత ఒకరికొకరు గట్టిగా ఆలింగనం చేసుకుని ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆలింగనాల సంస్కృతి ఇప్పుడు సర్వసాధారణంగా మారింది కాబట్టి లైట్‌గా తీసుకోవడమే బెటర్.