మూడేళ్ల బాలికపై లైంగికదాడి.. నిందితుడి అరెస్టు | Three-year-old girl accused of sexual assault arrested | Sakshi
Sakshi News home page

మూడేళ్ల బాలికపై లైంగికదాడి.. నిందితుడి అరెస్టు

Jul 12 2015 3:40 AM | Updated on Aug 21 2018 5:51 PM

మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కామాంధుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడిని షారుఖ్ సాహిద్‌గా

థానే : మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కామాంధుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడిని షారుఖ్ సాహిద్‌గా గుర్తించారు. వివరాలు.. నాసిక్‌లోని అంబర్‌నాథ్ జిల్లాలో మూడేళ్ల బాలికకు స్నానం చేయించడానికి తల్లి ఇంటి బయటకు తీసుకు వచ్చింది. సబ్బు తీసుకురావడానికి తల్లి లోపలికి వెళ్లగా, నిందితుడు బాలిక వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లి విషయాన్ని గమనించి ఇరుగు పొరుగు వారిని పిలిచింది. స్థానికులు నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement