రాష్ట్రంలోని అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరిలోని నెల్లితోపు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు
► అమ్మ ఆశీస్సులు
►నారాయణ ప్రమాణ స్వీకారం
►ఓటరుకు కరుణ కృతజ్ఞత
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరిలోని నెల్లితోపు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డ విషయం తెలిసిందే. అన్నాడీఎంకే అభ్యర్థులు అరవకురిచ్చిలోఉప ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బుధవారం చెన్నైకు చేరుకున్నారు. గెలుపు ధ్రువీకరణ పత్రాల తో అపోలో ఆసుపత్రిలో ఉన్న సీఎం జయలలిత ఆశీస్సుల్ని అందుకున్నారు. ఇక, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి నెల్లితోపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నారాయణకు శుభకాంక్షలు తెలుపుతూ, తమకు ఓట్లు వేసిన ఓటరుకు డీఎం కే అధినేత ఎం కరుణానిధి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
సెంథిల్ బాలాజీ, తంజావూరులో రంగస్వామి, తిరుప్పర గుండ్రంలో ఏకే బోసు విజయకేతనం ఎగుర వేశారు. నెల్లితోపులో కాంగ్రెస్ అభ్య ర్థి, ఆ రాష్ట్ర సీఎం నారాయణస్వామి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేలుగా ధ్రువీకరణ పత్రాలను అందుకున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాత్రికిరాత్రే చెన్నైకు చేరుకున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి, ఎడపాడి పళనిస్వామి, ఉదయకమార్, కామరాజ్‌లతో కలిసి కొత్త ఎమ్మెల్యేలు ముగ్గురు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తమ ధ్రువీకరణ పత్రాలతో అమ్మ జయలలిల ఆశీస్సుల్ని అందుకునేందుకు లోనికి వెళ్లారు. రెండు గంటల అనంతరం ఈ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్ మంత్రులు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. అమ్మ ఆశీస్సులు అందుకునేందుకు వచ్చామని, అమ్మ ఆరోగ్యం గురించి వైద్యుల్ని విచారించినట్టు పేర్కొని ముందుకు సాగారు.
నారాయణ ప్రమాణ స్వీకారం: పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులతో ముందుకు సాగిన నారాయణస్వామి, ఈ సారి ఉప ఎన్నికల ద్వారా ప్రప్రథమంగా విజయకేతనం ఎగుర వేశారు. ఇది ఆయనకు మహా ఆనందమే. తన ఆనందాన్ని పంచుకునేవిధంగా ఓటర్ల చెంతకు వెళ్లి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. బుధవారం ఉదయం తన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత అసెంబ్లీ స్పీకర్ వైద్యలింగం ప్రమాణ స్వీకారం చేరుుంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
ఇక, నారాయణస్వామికి తన శుభాకాంక్షలు తెలియజేసిన డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఓటర్లకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే అరాచకాలు, అధికార దుర్వినియోగం, ఎన్నికల యంత్రాంగం ఏకపక్ష తీరు సాగినా, తమ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు కరుణానిధి పేర్కొన్నారు. ఇక, అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞత తెలియజేశారు.