పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఎస్ ఐ వెంకట్ రెడ్డి కథనం ప్రకారం కుర్మగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఆంజనేయులు కుమార్తె(16) పదో తరగతి చదువుతోంది.
అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (24) ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి పది రోజుల క్రితం ఇంటి నుంచి తీసుకెళ్లాడు. బాలిక ఆచూకీ కోసం గాలించిన కుటుంబసభ్యులు ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.