తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ ఎంపీలు భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను గురువారం ఢిల్లీలో కలిశారు.
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ ఎంపీలు భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా పారికర్‌తో సమావేశమైన మంత్రులు తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి బైసన్ పోలో గ్రౌండ్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దాంతో ఫిబ్రవరిలో తాను తెలంగాణలో పర్యటిస్తానని పారికర్ తెలంగాణ మంత్రులకు చెప్పినట్టు తెలిసింది. అంతేకాక పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానని పారిక్కర్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
అంతకముందు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కలిశారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్ను బకాయిలు విడుదల చేయాలని ఆయన కోరారు. అంతేకాక తెలంగాణకు రుణ పరపతి పరిమితి పెంచాలని ఈటల విజ్ఞప్తి చేశారు.