మరో టీజర్‌తో ఎస్‌–3 కనువిందు | Surya's 'S3' teaser release | Sakshi
Sakshi News home page

మరో టీజర్‌తో ఎస్‌–3 కనువిందు

Jan 17 2017 2:24 AM | Updated on Sep 5 2017 1:21 AM

మరో టీజర్‌తో ఎస్‌–3 కనువిందు

మరో టీజర్‌తో ఎస్‌–3 కనువిందు

నటుడు సూర్య నటించిన ఎస్‌–3 చిత్రం మరో టీజర్‌ అభిమానులకు కనువిందు చేస్తోంది. 24 వంటి సూపర్‌హిట్‌ చిత్రం తరువాత సూర్య నటించిన చిత్రం ఎస్‌–3.

నటుడు సూర్య నటించిన ఎస్‌–3 చిత్రం మరో టీజర్‌ అభిమానులకు కనువిందు చేస్తోంది. 24 వంటి సూపర్‌హిట్‌ చిత్రం తరువాత సూర్య నటించిన చిత్రం ఎస్‌–3. ఈ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన సింగం, సింగం–2 చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఎస్‌–3. ఇందులో సూర్యకు జంటగా అనుష్కతో పాటు శ్రుతీహాసన్‌ నటించారు. హరి దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని స్టూడియోగ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించారు. పూర్తి కమర్షియల్‌ అంశాలతో పక్కా మాస్‌ చిత్రంగా తెరకెక్కిన చిత్రం ఎస్‌–3. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్, ఛేజింగ్‌ సన్నివేశాలతో పాటు అనుష్క, శ్రుతీహాసన్‌ల అందాలు చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.

కాగా గతేడాది డిసెంబర్‌ 16న ఎస్‌–3 చిత్రం విడుదల కావలసి ఉండగా పెద్ద నోట్ల ప్రభావం, తదితర అంశాల కారణంగా విడుదలను నిర్మాత వాయిదా వేసుకున్నారు. అయితే ఎస్‌–3 చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలో మరో టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ టీజర్‌తో పాటు నటుడు సూర్య తమిళనాడు, కేరళా రాష్ట్రాల్లోని థియేటర్లను పర్యవేక్షించనున్నారని తెలిసింది. ఎస్‌–3 చిత్రంపై అభిమానుల స్పందన ఎలా ఉందనే విషయాన్ని సూర్య తెలుసుకోవాలని అనుకుంటున్నదువల్లే ఈ విజిట్‌ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. కాగా చిత్రాన్ని ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెలలో బైరవా చిత్రం తరువాత విడుదలవుతున్న మరో భారీ చిత్రం ఇదే అవుతుందన్నది గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement