కాశ్మీర్ బాధితులకు అండగా.. | Support to victims of Kashmir | Sakshi
Sakshi News home page

కాశ్మీర్ బాధితులకు అండగా..

Sep 17 2014 4:11 AM | Updated on Sep 2 2017 1:28 PM

జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు బళ్లారి వాసులు ముందుకురావాలని ఉపమేయర్ జయలలిత, కార్పొరేటర్లు వెంకటరమణ తదితరులు విజ్ఞప్తి చేశారు.

సాక్షి, బళ్లారి : జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు బళ్లారి వాసులు ముందుకురావాలని ఉపమేయర్ జయలలిత, కార్పొరేటర్లు వెంకటరమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. జమ్ము కాశ్మీర్ బాధితులు కోసం విరాళాలు సేకరణకు సిటీ కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర వాసులు కూడా సాయం చేస్తే బళ్లారికి మంచి పేరు వస్తుందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంధ సంస్థలు జమ్ము కాశ్మీర్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు నడుం బిగించారని కొనియాడారు. అనంతరం నగరంలో పలు వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
 
కారటగిలో..
కారటగి : కనకగిరి, కారటగి బ్లాక్ కాంగ్రెస్, యువ ఘటక ఆధ్వర్యంలో జమ్ముకాశ్మీర్ బాధిత కుటుంబాలకు విరాళాల  సేకరణకు చిన్న నీటి పారుదల, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి మంగళవారం శ్రీకారం చుట్టారు. తమ నివాసం నుంచి ఆరోగ్య కేంద్రం వరకు  పాదయాత్ర చేస్తూ  మొత్తం రూ.77,120లను విరాళంగా సేకరించారు.  మంత్రి వెంట తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు ఈరమ్మ, ఉపాధ్యక్షుడు శరణప్ప, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు బీ.శరణయ్యస్వామి, సభ్యులు అయ్యప్ప ఉప్పార, సిద్దప్ప, గద్దెప్ప నాయక్, కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, యువ ఘటక అధ్యక్షుడు శరణ బసవ రాజరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement