ఆంధ్రా వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య | student commits suicide in andhra university | Sakshi
Sakshi News home page

ఆంధ్రా వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

Sep 15 2016 11:33 AM | Updated on Nov 9 2018 4:36 PM

ఆంధ్రా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్థరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత యశస్వి(22) అనే విద్యార్థి గదిలో ఉన్న కిటికీకి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. యశస్వి స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరి పేట. యూనివర్సిటీలో ‘లా’ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement