దీపావళి బోనస్.. రూ. 54 వేలు | Singareni Collieries staff to get Rs 54000 bonus | Sakshi
Sakshi News home page

దీపావళి బోనస్.. రూ. 54 వేలు

Oct 5 2016 12:17 PM | Updated on Sep 2 2018 4:23 PM

దీపావళి బోనస్.. రూ. 54 వేలు - Sakshi

దీపావళి బోనస్.. రూ. 54 వేలు

సింగరేణి కార్మికులకు తీపి కబురు అందింది.

రామకృష్ణాపూర్ : సింగరేణి కార్మికులకు తీపి కబురు అందింది. దీపావళి బోనస్‌గా రూ.54 వేలు చెల్లించేందుకు యూజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు ఐదు జాతీయ కార్మిక సంఘాలతో మంగళవారం కొల్‌కతాలో జరిగిన సమావేశంలో పండుగ బోనస్ రూ. 54 వేలు చెల్లించేందు కు యూజమాన్యం అంగీకారం తెలిపింది. ఈ విషయూన్ని సింగరేణి జీఎం(పర్సనల్) ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. గత సంవత్సరం రూ.48,500 చెల్లించగా.. ఈ ఏడాది అదనంగా రూ.5,500 పెంచేందుకు కొలిండియూ యూజమాన్యం అంగీకరించింది. కాగా, కార్మిక సంఘాలు రూ.65 వేల నుంచి రూ.75 వేలు దీపావళి బోనస్‌గా చెల్లించాలని డిమాండ్ చేశారుు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రూ. 54 వేలు చెల్లించేందుకు అంగీకరించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement