అజిత్ బర్త్‌డే గిఫ్ట్‌గా వాలు | Silambarasan's birthday gift to Ajit | Sakshi
Sakshi News home page

అజిత్ బర్త్‌డే గిఫ్ట్‌గా వాలు

May 1 2015 2:20 AM | Updated on Sep 3 2017 1:10 AM

అజిత్ బర్త్‌డే గిఫ్ట్‌గా వాలు

అజిత్ బర్త్‌డే గిఫ్ట్‌గా వాలు

అభిమానం అనేది కలగాలే కాని అది ఏదైనా చేసేస్తుంది. అందుకే వెలకట్టలేనిది అభిమానం అంటారు.

అభిమానం అనేది కలగాలే కాని అది ఏదైనా చేసేస్తుంది. అందుకే వెలకట్టలేనిది అభిమానం అంటారు. అలా నటుడు అజిత్ అంటే శింబుకు ఎనలేని అభిమానం. మే ఒకటిన అజిత్ పుట్టినరోజు. ఆయన అభిమానిగా ఆ రోజున శింబు తాను నటించిన వాలు చిత్రాన్ని విడుదల చేయాలని తలచారు. అయితే అనివార్య కారణాలవలన వాలు చిత్రం విడుదల మరోవారం వాయిదాపడడంతో ఏమి చేయాలో పాలుపోని శింబుకు ఒక ఆలోచన వచ్చింది.
 
  అదే వాలు చిత్ర టైటిల్‌ను తన అభిమాన నటుడు అజిత్ పుట్టినరోజున విడుదల చేయాలన్నది విషయం ఏమిటంటే ఈ చిత్రం ట్రీజర్ ఇంతకుముందే విడుదలైంది. ఇప్పుడు కొత్తగా మరో ట్రీజర్‌ను సిద్ధం చేసి శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేయనున్నట్లు శింబు పేర్కొన్నారు. శింబు, హన్సిక జంటగా నటించిన చిత్రం వాలు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. చిత్రం విడుదలకు ముందే శింబు, హన్సిక  ప్రేమ బ్రేక్ అయ్యిందన్నది గమనార్హం.
 
 నిక్ ఆర్ట్స్ పతాకంపై చక్రవర్తి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. వాలు చిత్రం ఈ నెల తొమ్మిదవ తేదిన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. శింబు నటించిన చివరి చిత్రం పోడాపోడి. ఆ చిత్రం 2012లో తెరపైకి వచ్చింది. ఆ తరువాత ఇప్పటి వరకు మరే చిత్రం విడుదల కాలేదు. దీంతో వాలు చిత్రంపై ఆయన అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement