విశాల్‌కు జంటగా షామిలి | Shamli romance with Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌కు జంటగా షామిలి

Jul 28 2015 3:11 AM | Updated on Apr 3 2019 8:57 PM

విశాల్‌కు జంటగా షామిలి - Sakshi

విశాల్‌కు జంటగా షామిలి

నటుడు విశాల్ నూతన చిత్రంలో ఆయనకు జంటగా నటుడు అజిత్ మరదలు, షాలిని చెల్లెలు షామిలి నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

తమిళసినిమా: నటుడు విశాల్ నూతన చిత్రంలో ఆయనకు జంటగా నటుడు అజిత్ మరదలు, షాలిని చెల్లెలు షామిలి నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విశాల్ ప్రస్తుతం పాయుమ్ పులి చిత్రాన్ని పూర్తి చేసి దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. తదుపరి లింగసామి దర్శకత్వంలో సండైకోలి 2 చిత్రంతో నటించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా తమన్న, నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా నటి షామిలి పేరు తెరపైకి వచ్చింది.
 
 ఆమె విదేశాల్లో సినిమాకు సంబంధించిన కోర్స్ చదివి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు. మళ్లీ నటించడానికి సిద్ధమై మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. షామిలి ఫొటోలను నెట్‌లో చూసిన దర్శకుడు లింగుసామి తన సండైకోళి చిత్రంలో హీరోయిన్ పాత్రకు సరిగ్గా నప్పుతారని భావించి ఆమెను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. సండైకోళి చిత్రంలో నటించిన నటి మీరాజాస్మిన్, నటుడు రాజ్‌కిరణ్ ఈ చిత్రంలోనూ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. డి ఇమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement