నాపై దుష్ప్రచారం జరుగుతోంది: శశికళ | sasikala meets aiadmk leaders | Sakshi
Sakshi News home page

నాపై దుష్ప్రచారం జరుగుతోంది: శశికళ

Feb 12 2017 3:48 PM | Updated on Sep 5 2017 3:33 AM

నాపై దుష్ప్రచారం జరుగుతోంది: శశికళ

నాపై దుష్ప్రచారం జరుగుతోంది: శశికళ

తనకు 133 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించకుండా జాప్యం చేయడం సరికాదని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు.

చెన్నై: తనకు 133 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించకుండా జాప్యం చేయడం సరికాదని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. ఆదివారం పోయెస్ గార్డెన్లో పార్టీ నేతలు, సినీ ప్రముఖులతో ఆమె సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్బంగా శశికళ మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలందరూ తనతోనే ఉన్నారని, గవర్నర్ విద్యాసాగర్ రావు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై తనకు నమ్మకం ఉందన్నారు. గవర్నర్కు తాను ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు. పార్టీని చీల్చేందుకు కొందరు కుట్ర పన్నారని శశికళ ఆరోపించారు. కుట్ర పన్నింది ఎవరో అందరికీ తెలుసునని, తమిళనాడులో ఏం జరుగుతోందో అందరికీ తెలుసునని అన్నారు. బెదిరింపులకు తాను భయపడబోనని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వీటిని ఎదుర్కొంటానని చెప్పారు. అన్నా డీఎంకే ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందన్నారు. గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశమయ్యేందుకు ఆమె బయల్దేరి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement