సూళ్లురుపేటలో భారీగా ఎర్రచందనం పట్టివేత | red sandalwood seized in Sullurupeta | Sakshi
Sakshi News home page

సూళ్లురుపేటలో భారీగా ఎర్రచందనం పట్టివేత

Oct 9 2016 10:26 AM | Updated on Aug 11 2018 9:10 PM

నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తీసుకు వెళ్తున్న మినీ వ్యాన్ను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. అయితే వ్యాన్ డ్రైవర్తోపాటు నిందితులు పరారైయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement