
అరుదైన ఎలక్ట్రిక్ చేప లభ్యం
80 వాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం ఉన్న అరుదైన చేప తమిళనాడులోని రామనాథపురం సముద్రంలో జాలరి వలలో చిక్కింది.
చెన్నై (తిరువొత్తియూరు):
80 వాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం ఉన్న అరుదైన చేప తమిళనాడులోని రామనాథపురం సముద్రంలో జాలరి వలలో చిక్కింది. రామనాథపురం జిల్లా పాంబన్ నుంచి మన్నార్‌వలై ప్రాంతంలో చేపలు పట్టేందుకు ఫైబర్ పడవలలో జాలర్లు వెళ్లారు. వారు చేపలు పట్టుకుని మంగళవారం ఒడ్డుకు చేరారు.
ఇందులో ఒక జాలరి వలలో అరుదైన ఎలక్ట్రిక్ చేప కనిపించింది. ఇది ఒకటిన్నర అడుగు పొడవు, ఐదు కిలోల బరువు కలిగి బ్రౌన్ రంగులో చుక్కలు కలిగి ఉంది. దీన్ని మార్ఫిల్డ్ ఎలక్ట్రిక్ రేఫిష్ అంటారు. ఈ రకం చేపలు అట్లాంటిక్ మహా సముద్రం, దక్షిణాఫ్రికా సముద్రంలో ఎక్కువగా ఉంటాయి. ఈ రకం చేపల శరీర భాగంలో పొలుసులు 80 వాట్స్ విద్యుత్ విడుదల చేసే సామర్థ్యం కలిగి ఉంటాయని పరిశోధకులు తెలిపారు.