రెప్పపాటులో తప్పిన ప్రమాదం | raod accident in Whitefield Bangalore | Sakshi
Sakshi News home page

రెప్పపాటులో తప్పిన ప్రమాదం

Jun 9 2017 8:38 AM | Updated on Aug 30 2018 4:10 PM

ట్రక్కు కిందపడి నుజ్జునుజ్జైన ద్విచక్ర వాహనం - Sakshi

ట్రక్కు కిందపడి నుజ్జునుజ్జైన ద్విచక్ర వాహనం

ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రెప్పపాటుతో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

వైట్‌ఫీల్డ్‌ :  ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రెప్పపాటుతో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌–హోప్‌ఫార్మ్‌ సిగ్నల్స్‌ సర్కిల్‌లో జరిగిన సంఘటన వివరాలు...రాజస్తాన్‌ రాష్ట్రానికి చెందిన చందన్‌ (29) తన ద్విచక్ర వాహనంలో ఐటీపీఎల్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ద్విచక్ర వాహనాన్ని ట్రక్‌ ఢీకొనడంతో టూవీలర్‌ ట్రక్‌ మధ్య భాగంలో ఇరుక్కుపోయింది. ద్విచక్ర వాహనం నుంచి చందన్‌ పక్కకు పడిన వెంటనే వెనుక ఉన్న మరోయువకుడు పక్కకు లాగడంతో ప్రమాదం తప్పింది. వైట్‌ఫీల్డ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement