కువైట్‌ ప్రమాదంలో రామకృష్ణ క్షేమం | Ramakrishna's well-being in Kuwait threat | Sakshi
Sakshi News home page

కువైట్‌ ప్రమాదంలో రామకృష్ణ క్షేమం

May 8 2017 2:37 AM | Updated on Aug 30 2018 4:10 PM

కువైట్‌ ప్రమాదంలో రామకృష్ణ క్షేమం - Sakshi

కువైట్‌ ప్రమాదంలో రామకృష్ణ క్షేమం

కువైట్‌లోని షర్క్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్‌) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

►  ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు
కొరుక్కుపేట: కువైట్‌లోని షర్క్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్‌) అధ్యక్షుడు  తంగుటూరి రామకృష్ణ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కువైట్‌ శాఖను ప్రారంభించేందుకు కువైట్‌ వెళ్లిన రామకృష్ణతో పాటు వామ్‌ నార్త్‌ ఈస్ట్‌ దేశాల కో–ఆర్డినేటర్‌ ఎంఎన్‌ఆర్‌ గుప్తా, కువైట్‌ వామ్‌ ప్రధాన కార్యదర్శి సాయి సుబ్బారావు ఈనెల 6న షర్క్‌ ప్రాంతంలో కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారును వ్యామ్‌ కువైట్‌ సెక్రటరీ దేసు సాయి సుబ్బారావు నడుపుతున్నారు. రామకృష్ణ వెళుతున్న ముందు కారు యాక్సిడెంట్‌కు గురై పక్క లైన్‌లోకి వెళ్లడంతో ఆ లైన్‌లో వచ్చిన కార్లు దానిని ఢీకొన్నాయి.

దీంతో సుబ్బారావు సడన్‌ బ్రేక్‌ వేయడం, వెనుక నుంచి వచ్చిన కార్లు ప్రమాదం చేసిన కారును ఢీకొనడంతో, ఈ క్రమంలో డివైడర్, కారు మధ్యలో రామకృష్ణ కారు ముందుకు దూసుకెళ్లింది. కారులో ముందు సీటులో ఉన్న రామకృష్ణ సీటుబెల్టు వేసుకోవడం వల్ల క్షేమంగా బయటపడ్డారు. రెప్పపాటులో కార్లు ఒకదాన్నొకటి ఢీకొని తిరగబడ్డాయి. రామకృష్ణతో పాటు ఎంఎన్‌ఆర్‌.గుప్తా, సాయి సుబ్బారావు సురక్షితంగా బయటపడ్డారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వామ్‌ సభ్యులు రామకృష్ణను పరామర్శిçస్తూ్త శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా కువైట్‌లో భారీ స్థాయిలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కువైట్‌ శాఖను ప్రారంభించారు. వందల సంఖ్యలో పురుషులు మహిళలు పాల్గొని శ్రీ కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కువైట్‌ శాఖ అధ్యక్షులుగా రవీంద్రనాథ్, కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement