తమిళంలోకి రాజుగారి గది | Raju gari gadi in tamil movie | Sakshi
Sakshi News home page

తమిళంలోకి రాజుగారి గది

Nov 1 2015 8:01 AM | Updated on Sep 3 2017 11:50 AM

నిర్మాత ఆర్ దివాకర్

నిర్మాత ఆర్ దివాకర్

టాలీవుడ్‌లో ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సొంతం చేసుకున్న చిత్రం రాజుగారి గది.

 చెన్నై : టాలీవుడ్‌లో ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సొంతం చేసుకున్న చిత్రం రాజుగారి గది. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం త్వరలో కోలీవుడ్‌కు రానుంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆర్.దివాకర్ గురించి చెప్పే తీరాలి. ఈయన ప్రముఖ ఛాయాగ్రహకుడు.

తమిళంలో పార్దీపన్ కనవు చిత్రం ద్వారా తొలిసారిగా కెమెరాను హ్యాండిల్ చేశారు. ఇటీవల విడుదలైన నటి జోతిక నటించిన 36 వయదినిలే, దాని ఒరిజినల్ మలయాళ చిత్రం హౌఓల్ట్ ఆర్ యూ వరకూ తమిళం, తెలుగు, మలయాళం, కన్న డం మొదలగు భాషల్లో ప లు చిత్రాలకు తన ఛాయాగ్రహ నైపుణ్యాన్ని అందించారు. అలాంటి దివాకర్ తాజాగా నిర్మాతగా అవతారమెత్తారు. ఓంకార్‌తో కలిసి రాజుగారి గది చిత్రాన్ని నిర్మించారు. ఇందులో స్టార్ నటీనటులెవరూ లేరు.

అంతకు పెద్ద విజయాలను సాధించిన నటులు ఇందులో లేరు. అయిన రాజుగారి గది దసరా పండుగ సందర్భంగా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలయ్యి విజయం వైపు దూసుకు పోతోంది. పెద్ద చిత్రా ల స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న రాజుగారి గది చిత్రం గురించి నవ నిర్మాత ఆర్.దివాకర్ స్పందన అడగ్గా చిన్న చిత్రం పెద్ద చిత్రం అనేది వాటి బడ్జెట్‌కు సంబంధించిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement