రాజీవ్గాంధీకి ఘన నివాళి | Rajiv Gandhi on death anniversary | Sakshi
Sakshi News home page

రాజీవ్గాంధీకి ఘన నివాళి

May 21 2016 12:24 PM | Updated on Jul 11 2019 8:38 PM

భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఘనంగా నివాళులర్పించారు.

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని రాజీవ్ సమాధి వీరభూమి వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పుష్ప గుచ్చాం ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తోపాటు గులామ్ నాబి ఆజద్, అహ్మాద్ పటేల్, సుశీల్ కుమార్ షిండే, పీసీ చాకో, షీలా దీక్షిత్, డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్లు పాల్గొని... రాజీవ్కు ఘనంగా నివాళులర్పించారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement