రేపు రజనీ పుట్టిన రోజు వేడుకలు | Rajinikanth's birthday Celebrations on Thursday | Sakshi
Sakshi News home page

రేపు రజనీ పుట్టిన రోజు వేడుకలు

Dec 11 2013 2:49 AM | Updated on Sep 2 2017 1:27 AM

సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు వచ్చిందంటే ఆయన అభిమానులకు పండగే. రజనీ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నా

తమిళసినిమా, న్యూస్‌లైన్: సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు వచ్చిందంటే ఆయన అభిమానులకు పండగే. రజనీ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నా అభిమానులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రజనీ కాంత్ గురువారం 64వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ వేడుకను ఆయన అభిమానులు విశేషంగా జరుపుకుంటున్నారు. నగరంలో నాలుగు రోజులపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగం గా అన్నానగర్‌లో 64 పంచెలు, 64 చీరలు ఉచితంగా అందించనున్నారు. వారందరికీ అన్నదానం చేయనున్నారు. 
 
 తాంబరంలోని వికలాంగులకు ఇస్త్రీపెట్టెలు, కుట్టుమిషన్‌లను రజనీ అభిమానులు ఉచితంగా అం దించనున్నారు. నెల్సన్ మాణిక్యం రోడ్డులోని నివాస్ బాలల ఆశ్రమంలో వంద మంది బాలబాలికలకు అన్నదానం చేయనున్నారు. 12వ తేదీ ఉదయం ఏడు గం టలకు రాఘవ లారెన్స్ ట్రస్ట్‌కు చెందిన పిల్లలకు అన్నదానం చేయనున్నట్లు అభిమానులు తెలిపారు. టీనగర్‌లోని తిరుమ ల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వలసరవాక్కం రజనీ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నేశం ఆశ్రమంలో అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంబత్తూర్ రజనీ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కొరట్టూర్ సరస్వతి అమ్మాళ్ ఆశ్రమంలో ఈ సందర్భంగా అన్నదానం చేయనున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement