రజనీకాంత్‌కు బీజేపీ గాలం | Rajinikanth To BJP angling | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కు బీజేపీ గాలం

Jan 5 2014 2:07 AM | Updated on Mar 29 2019 9:18 PM

రజనీకాంత్‌కు బీజేపీ గాలం - Sakshi

రజనీకాంత్‌కు బీజేపీ గాలం

సూపర్‌స్టార్ రజనీ కాంత్ కోసం బీజేపీ గాలం వేస్తోంది. ఈ పార్టీ రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని పెంచుకుని కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని

తమిళసినిమా, న్యూస్‌లైన్: సూపర్‌స్టార్ రజనీ కాంత్ కోసం బీజేపీ గాలం వేస్తోంది. ఈ పార్టీ రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని పెంచుకుని కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమిళనాడులో బీజేపీ ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు. బిగ్‌షాట్స్ అనే వాళ్లకు వల విసిరే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా అత్యంత అభిమానగణం, ప్రజాదరణ గల నటుడు రజనీకాంత్‌ను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తమిళనాడు భారతీయ లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ సంఘం సమావేశం శనివారం తిరుచ్చిలో జరిగింది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మురళిధరరావ్ అధ్యక్షత వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఇల.గణేశన్, తమిళచ్చి సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పొన్‌రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నరేంద్రమోడి గాలి వీస్తోందన్నారు. ఆ ప్రభావం తమిళనాడులోనూ బలంగా ఉందన్నారు. బీజేపీ తన బలాన్ని పెంచుకుని కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ అధికారం చేపట్టనుందన్నారు. తమిళనాడులో ఇతర పార్టీలతో కూటమికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎండీఎంకేతో చర్చలు ముగిశాయని, డీఎండీకేతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా నటుడు రజనీకాంత్ మొదలగు ముఖ్యమైన వ్యక్తుల మద్దతు కోరనున్నట్లు పొన్‌రాధాకృష్ణన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement