జయకు కరుణానిధి భార్య పరామర్శ | Rajathi Ammal, DMK patriarch Karunanidhis wife visits Jayalalithaa | Sakshi
Sakshi News home page

జయకు కరుణానిధి భార్య పరామర్శ

Oct 15 2016 3:18 PM | Updated on Sep 4 2017 5:19 PM

జయకు కరుణానిధి భార్య పరామర్శ

జయకు కరుణానిధి భార్య పరామర్శ

డీఎంకే అధినేత కరుణానిధి భార్య రాజాతి అమ్మాళ్ చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

డీఎంకే అధినేత కరుణానిధి భార్య రాజాతి అమ్మాళ్ చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జయలలిత సన్నిహితురాలు శశికళను కలసి వివరాలు తెలుసున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అమ్మాళ్‌ ఆకాంక్షించారు. అమ్మాళ్‌ శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రికి వెళ్లినట్టు అన్నా డీఎంకే, డీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ ఇటీవల అపోలోకు వెళ్లి జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేసిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 22 నుంచి తమిళనాడు సీఎం అపోలోలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది ప్రముఖులు అపోలోకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య నిన్న అపోలో ఆస్పత్రిని సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement