నర్సంపేటలో ఉన్మాది వీరంగం | psycho hulchal in warangal district | Sakshi
Sakshi News home page

నర్సంపేటలో ఉన్మాది వీరంగం

Oct 22 2016 3:32 PM | Updated on Aug 17 2018 2:10 PM

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు.

నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. యాసిడ్ సీసా చేతపట్టుకొని పట్టణంలోని ఓ మెడికల్ షాపు వద్దకు వచ్చిన ఉన్మాది యాసిడ్‌ను షాపు యజమానిపై పోసేందుకు యత్నించాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కత్తి, యాసిడ్ సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement