సెల్వంను చంపేస్తా.. శశి అనుచరుడిపై కేసు | Pro-Sasikala leader booked for allegedly threatening Panneerselvam | Sakshi
Sakshi News home page

సెల్వంను చంపేస్తా.. శశి అనుచరుడిపై కేసు

Feb 13 2017 6:44 PM | Updated on Sep 5 2017 3:37 AM

సెల్వంను చంపేస్తా.. శశి అనుచరుడిపై కేసు

సెల్వంను చంపేస్తా.. శశి అనుచరుడిపై కేసు

పన్నీరు సెల్వంను హతమారుస్తానని హెచ్చరించిన అన్నా డీఎంకే మాజీ ఎమ్మెల్యే, శశికళ మద్దతుదారుడు వీపీ కలైరాజన్‌పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను హతమారుస్తానని హెచ్చరించిన అన్నా డీఎంకే మాజీ ఎమ్మెల్యే, శశికళ మద్దతుదారుడు వీపీ కలైరాజన్‌పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కుట్రతోనే తనపై కేసు నమోదు చేశారని కలైరాజన్ ఆరోపించారు. దక్షిణ చైన్నై జిల్లా పార్టీ కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు.

అన్నా డీఎంకే శాసన సభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికైన తర్వాత పన్నీరు సెల్వం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. శశికళ వర్గీయులు తన చేత బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారని బాంబు పేల్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళకు వీరవిధేయుడైన కలైరాజన్.. పన్నీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెల్వంను చంపేస్తానని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కలైరాజన్పై కేసు నమోదు చేశారు.
 

తమిళనాడు కథనాలు చదవండి...
 

 

Advertisement
 
Advertisement
Advertisement