సమాజంపట్ల తమకూ బాధ్యత ఉందంటూ ముందుకొచ్చారు బాలీవుడ్ తారలు ప్రియాంకచోప్రా
న్యూఢిల్లీ: సమాజంపట్ల తమకూ బాధ్యత ఉందంటూ ముందుకొచ్చారు బాలీవుడ్ తారలు ప్రియాంకచోప్రా, ఫ్రీడా పింటో. ‘గర్ల్ రైజింగ్’ పేరిట బాలికలను సినిమాల ద్వారా ప్రోత్సహించేందుకుగాను వీరిరువురూ విశ్వవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి నగరంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రియాంకచోప్రా, ఫ్రీడా పింటో మీడియాతో మాట్లాడారు. బాలికలు చదువుకుంటే వారికి కలిగేప్రయోజనాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమన్నారు.