గర్భిణి నరకయాతన | Pregnant Woman Delivery in Auto Baby Deceased Karnataka | Sakshi
Sakshi News home page

గర్భిణి నరకయాతన

Jul 21 2020 7:28 AM | Updated on Jul 21 2020 7:28 AM

Pregnant Woman Delivery in Auto Baby Deceased Karnataka - Sakshi

కేసీ జనరల్‌ ఆస్పత్రికి ఆటోలో వచ్చిన గర్భిణి

కర్ణాటక, యశవంతపుర: ప్రసవం కోసం ఓ గర్భిణి ఎనిమిది గంటల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా బెడ్లు లేవని కారణంతో ఆమెను చేర్చుకోకపోవడంతో చివరకు ఆమె ఆటోలోనే ప్రసవించిన ఘటన బెంగళూరు చోటు చేసుకుంది. వివరాలు... శ్రీరామపురకు గర్భిణికి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి బయలుదేరారు. శ్రీరామపుర ప్రభుత్వ ఆస్పత్రి, విక్టోరియా, వాణి విలాస్‌తో పాటు 10 ఆస్పత్రులకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లిన బెడ్‌లేదంటూ చెప్పటంతో కేసీ జనరల్‌ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ కూడా బెడ్‌ లేదని చెప్పారు. దీంతో గర్భిణి ఆటోనే ప్రసవించారు. ఆ కొద్ది సేపటికే శిశువు మరణించింది. స్పందించిన ఆస్పత్రి సిబ్బంది అరగంట తరువాత ఆస్పత్రిలో చేరుకున్నారు. ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతోనే శిశువు మృతి చెందిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement