‘లోకల్’ మహిళలకు మరింత రక్షణ | Police protection for local womens in 24 hours | Sakshi
Sakshi News home page

‘లోకల్’ మహిళలకు మరింత రక్షణ

Aug 26 2013 11:37 PM | Updated on Aug 21 2018 5:44 PM

లోకల్ రైళ్లలో మహిళా ప్రయాణికులకు 24 గంటల పాటు భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భద్రత కన్నా అదనంగా 475 మంది హోంగార్డులను నియమించనుంది.

సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో మహిళా ప్రయాణికులకు 24 గంటల పాటు భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భద్రత కన్నా అదనంగా 475 మంది హోంగార్డులను నియమించనుంది. ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ)కు చెందిన 375 మంది రైల్వే ప్లాట్‌ఫాం, లోకల్ రైళ్ల బోగీలలో భద్రతాపరమైన విధులు నిర్వహిస్తున్నా రు. ఇప్పుడు మరో 475 మంది భద్రతా సిబ్బందిని నియమించడంతో ప్రతి మహిళా బోగీలో 24 గంటల పాటు భద్రత కల్పించేందుకు వీలవుతుంది.
 
 శనివారం ప్రభుత్వ సీనియర్ అధికారులు, రైల్వే అధికారుల మధ్య జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోం) అమితాబ్ రాజన్ తెలిపారు. ప్రస్తుతం 2,000 బోగీలు మహిళల కోసం కేటాయించబడి ఉన్నాయి. భద్రతా సిబ్బంది కొరత వల్ల 574 బోగీలలో భద్రతను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పెరుగుతున్న సిబ్బంది దృష్ట్యా ఈ బోగీ ల్లోనూ  భద్రత కల్పించేందుకు వీలవుతుంది. ఇదిలా వుండగా లోకల్ రైళ్లలో రోజుకు 70 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.
 
 వీరిలో 20 లక్షల మంది మహిళలు ఉంటారు. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రతి బోగీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సాయుధ దళాలను కలిగిన వారిని నియమించాల్సి ఉంటుంది. ఇదిలా వుండగా తాము 275 మంది ఆర్పీఎఫ్ కింద, 200 మందిని జీపీఆర్ కింద నియమించేందుకు ఈ సమావేశంలో అంగీకరించామని అమితాబ్ రాజన్ తెలిపారు. దీంతో ఇక మీదట ప్రతి మహిళా బోగీలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అయితే ఇది ఆచరణలోకి రావడానికి మరికొంత సమయం పట్టనుందని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement