బస్సుల్లోనూ పెట్స్‌కు అనుమతి

pets allowed in busses with same ticket price - Sakshi

చార్జీ తీసుకోవాల్సిందే

దొడ్డబళ్లాపురం: ఇళ్లల్లో పక్షులను, ప్రాణులను పెంచుకునే వారు పనిమీద వేరే ఊరికి వెళ్లాలంటే పెద్ద చిక్కే. పెట్స్‌ను బస్సుల్లో వదలరమ్మా, రెండురోజులు చూసుకోండి అని ఇరుగుపొరుగుకు బతిమాలుకోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే కుక్కలు, పిల్లులు, పక్షులు తదితరాలను ఆర్టీసీ బస్సులు, రైళ్లలో అనుమతించరు కాబట్టి వాటిని వెంట తీసుకుపోవడం కుదరదు.

ఇకపై కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో పెంపుడు జంతువులు, పక్షులను తీసుకుని ప్రయాణించడానికి అనుమతి ఇస్తారట. ఒక పెట్‌కి ఒక టికెట్‌ కొనాల్సి ఉంటుంది. ఇకపై ఇష్టానుసారంగా లగేజీలు తీసుకువెళ్లడం కూడా కుదరదు. కేఎస్‌ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. పక్షులు, ప్రాణులు బస్సుల్లో వస్తే ఇతరులకు ఇబ్బందిగా ఉండడంతో పాటు శుభ్రత లోపిస్తుందని వాపోతున్నారు.

లగేజీ చార్జీలు పెంపు
ఒక వ్యక్తి 30 కేజీలు, పిల్లలయితే 15 కేజీలు లగేజీ మాత్రమే తీసికెళ్లే అవకాశం ఉందట. అంతకుమించి లగేజీ తప్పనిసరయితే కేజీకి రూ.1 చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుండి ఈ కొత్త నిబంధనలు, ధరలు వర్తిస్తాయి. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top