నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను పళ్ళిపట్టులో మెగా అభిమానులు కోలాహలంగా
పళ్లిపట్టు: నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను పళ్ళిపట్టులో మెగా అభిమానులు కోలాహలంగా జరుపుకున్నారు. నటుడు పవన్‌కల్యాణ్ జన్మదినం బుధవారం పురస్కరించుకుని పళ్లిపట్టులోని తమిళనాడు మెగా అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కోలాహలంగా నిర్వహించారు.
మెగా అభిమానుల సంఘం అధ్యక్షుడు సుధీర్‌రాయల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ పంచాయతీ అధ్యక్షురాలు చిత్రాశివకుమార్, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కుషల్ చెంద్ మెహతా, విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు రెడ్డి సహా అనేక మంది పాల్గొన్నారు. వేడుకల్లో ముందుగా అభిమానుల సందడి నడుమ భారీ కేక్ కట్‌చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అలాగే పాఠశాల విద్యార్ధులకు నోటు పుస్తకాలు పెన్నులు, పలకలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానుల సంఘం నిర్వాహకులు మోహన్‌కుమార్,అల్లిబాయ్,శ్రీకాంత్,ఫాజిల్, దివాకర్, నరేష్ పాల్గొన్నారు.