జంప్ జిలానీలకు ‘ఎర్ర తివాచీ’.. | parties changed candidates importance all parties | Sakshi
Sakshi News home page

జంప్ జిలానీలకు ‘ఎర్ర తివాచీ’..

Jan 22 2015 10:52 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పార్టీలు మార్చే నేతలకు పండుగలా మారాయి. పార్టీ మార్చి తమ కూటమిలో చేరిన నేతలకు టికెట్ ఇవ్వడానికి బీజేపీ,

సాక్షి, న్యూఢిల్లీ: ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పార్టీలు మార్చే నేతలకు పండుగలా మారాయి. పార్టీ మార్చి తమ కూటమిలో చేరిన నేతలకు టికెట్ ఇవ్వడానికి బీజేపీ, కాంగ్రె స్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. తమ కార్యకర్తలు, మద్దతుదారుల డిమాండ్లను అసంతృప్తిని కూడా పట్టించుకోకుండా పార్టీలు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి గెలవగల సత్తా ఉన్న పార్టీ మార్చిన నేతలకు టికెట్లు కేటాయించాయి.70 నియోజకవర్గాల్లో ఆప్ నిలబెట్టిన అభ్యర్థుల్లో 30 శాతం మంది ఏదో ఒక పార్టీ నుంచి ఆప్‌లోకి వచ్చిన వారే. అలాగే బీజేపీ అభ్యర్థుల్లోనూ పలువురు ఇతర  పార్టీలకు చెందిన పెద్ద నేతలే కావడం విశేషం.

ఓఖ్లా, బల్లీమారన్ వంటి ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న  నియోజకవర్గాల్లో ఎల్‌జెపి, బీఎస్పీ నుంచి వచ్చిన ముస్లిం అభ్యర్థులను బీజేపీ బరిలో నిలబెట్టింది. కాంగ్రెస్ కూడా  జేడీయూ వీడి తమ పార్టీలో చేరిన షోయబ్ ఇక్బాల్‌తో పాటు  బీఎస్పీ, బీజేపీ, ఆప్‌లకు చెందినమాజీ నేతలకు, గత ఎన్నికల్లో ఇండిపెండెంటుగా గెలిచి ఇటీవల పార్టీలో చేరిన రామ్ బీర్ షౌకీన్ భార్య రీటా షౌకీన్‌కు టికెట్లు కేటాయించింది. పార్టీలు మార్చిన అభ్యర్థుల కారణంగా కనీసం 10 నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారింది. వాటిలో పడ్పట్‌గంజ్, పటేల్‌నగర్, అంబేద్కర్‌నగర్, ఓఖ్లా తదితర నియోజకవర్గాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement