విద్యార్థినిపై అత్యాచారయత్నం | On student molest by a boy | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై అత్యాచారయత్నం

May 9 2015 3:51 AM | Updated on Nov 9 2018 5:02 PM

కళాశాలకు వెళ్లి వస్తున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు...

- యువకుడి అరెస్ట్
టీనగర్:
కళాశాలకు వెళ్లి వస్తున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. తండ్రి కళ్లెదుటే ఈ సంఘటన చోటుచేసుకుంది. శివగంగై జిల్లా, తిరుప్పువనం సమీపం మాంగుడికి చెందిన యువతి (18). మదురైలోగల ప్రైవేటు కళాశాలలో బీఏ రెండవ సంవత్సరం చదువుతోంది. బుధవారం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగివస్తోంది. కలియాత్తూరులో బస్సు దిగిన రాజేశ్వరి రెండు కిలోమీటర్ల దూరంలోగల ఇంటికి నడిచివస్తోంది.

ఈమెను వెంబడించిన అదే ప్రాంతానికి చెందిన ప్రేమ్‌కుమార్, వెంకటేశన్, వీరభద్రన్, జగన్నాథన్ ఆమెను గేలిచేస్తూవచ్చారు. జనసంచారం లేని ప్రాంతంలో ఆమెపై నలుగురు అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె బయలుదేరి చాలాసేపు కావడంతో అనుమానించిన ఆమె తండ్రి వెతుక్కుంటూ వచ్చాడు. ఆ సమయంలో నలుగురు తన కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించడంతో ఆందోళనతో అడ్డుకునే యత్నం చేశాడు. అతడిపై నలుగురు దాడి చేసి పారిపోయారు. దీనిపై తిరుబువనం పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement