ఐదారొందల ఫొటోలు దిగా..! | nara lokesh respond on his personal photos | Sakshi
Sakshi News home page

ఐదారొందల ఫొటోలు దిగా..!

Nov 17 2016 8:05 AM | Updated on Aug 29 2018 3:37 PM

విదేశీ యువతితో లోకేశ్‌(ఫైల్‌) - Sakshi

విదేశీ యువతితో లోకేశ్‌(ఫైల్‌)

సెల్ఫీలు దిగితే తప్పా? సెల్ఫీలు దిగేటప్పుడు యువకులుగా మనం ఫేస్‌లు విచిత్రంగా పెట్టమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రశ్నించారు.

‘సాక్షి’ మూడే ప్రచురించింది
విదేశీ యువతులతో ఫొటోలపై స్పందించిన లోకేశ్‌
20 రోజులు దేశమంతా తిరిగినట్లు వెల్లడి
సెల్ఫీలు దిగితే తప్పేంటని ప్రశ్న


అనంతపురం టౌన్‌: సెల్ఫీలు దిగితే తప్పా? సెల్ఫీలు దిగేటప్పుడు యువకులుగా మనం ఫేస్‌లు విచిత్రంగా పెట్టమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రశ్నించారు. 2006లో స్టాన్‌ ఫర్డ్‌ నుంచి వచ్చిన మిత్రులందరితో కలసి 20 రోజుల పాటు దేశమంతా తిరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో ఐదారొందల ఫొటోలు దిగానని, అయితే అందులోంచి మూడు ఫొటోలే ’సాక్షి’ పత్రికలో వేశారని అన్నారు. చైతన్యయాత్రలో భాగంగా బుధవారం అనంతపురం శివారులోని పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో ’ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో యువత పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ’మీరు ఫారిన్‌ గర్ల్‌ల్స్‌తో తిరిగారనే ప్రచారం జరుగుతోంది.. అది నిజమా?’ అని సునీల్‌ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేశ్‌ పైవిధంగా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement