ఐపీఎస్ అధికారిపై భార్య ఫిర్యాదు | My husband is Torturing Me, says meghana wife of IPS officer Santhosh Kumar | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ అధికారిపై భార్య ఫిర్యాదు

Jul 21 2015 4:11 PM | Updated on Sep 3 2017 5:54 AM

ఐపీఎస్ అధికారిపై భార్య ఫిర్యాదు

ఐపీఎస్ అధికారిపై భార్య ఫిర్యాదు

భర్త తనను వరకట్నపు వేధింపులకు గురిచేస్తున్నట్లు ఐపీఎస్ అధికారిపై భార్య డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

చెన్నై : భర్త తనను వరకట్నపు వేధింపులకు గురిచేస్తున్నట్లు ఐపీఎస్ అధికారిపై భార్య డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. చెన్నై పోలీసు డిప్యూటీ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి సంతోష్‌కుమార్ పనిచేస్తున్నారు. ఇతని భార్య మేఘనాకుమార్. ఈమె చెన్నై మెరీనాబీచ్‌లోని డీజీపీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ టికె రాజేంద్రన్ అందుకున్నారు.
 
 ఫిర్యాదు అందజేసిన తర్వాత మేఘనాకుమార్ విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల క్రితం తనకు భర్త ఐపీఎస్ అధికారి సంతోష్‌కుమార్‌కు వివాహం జరిగిందని, ప్రస్తుతం తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తమ మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం తన భర్త విలువైన ఫ్లాట్, స్థలం, నగదు, నగలు ఇవ్వాలంటూ  చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు చెప్పారు.

అతనిపై ఫిర్యాదు చేస్తే బిడ్డను అపహరించి తీసుకువెళతానని హెచ్చరించారని, అందుచేత తన భర్తపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు కోవాలని రోదిస్తూ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement