కారులో రూ. 1000 నోట్ల కట్టలు స్వాధీనం | Mumbai: Rs. 1 Crore In Old Notes Found Inside Car | Sakshi
Sakshi News home page

కారులో రూ. 1000 నోట్ల కట్టలు స్వాధీనం

Nov 20 2016 5:52 PM | Updated on Sep 4 2017 8:38 PM

కారులో రూ. 1000 నోట్ల కట్టలు స్వాధీనం

కారులో రూ. 1000 నోట్ల కట్టలు స్వాధీనం

ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల నుంచి ముంబై పోలీసులు కోటి రూపాయల విలువైన పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ముంబై: ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల నుంచి ముంబై పోలీసులు కోటి రూపాయల విలువైన పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో 1000 రూపాయల నోట్లను తీసుకెళ్తుండగా క్రైం బ్రాంచ్‌ పోలీసులు పట్టుకుని నిందితులను అరెస్ట్‌ చేశారు.

నిందితులు రద్దయిన పాత నోట‍్లను మార్చుకుని కొత్త 2000 రూపాయల నోట్లు తీసుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తామని, ఇందుకోసం 30 శాతం కమిషన్‌ ఇవ్వాలని  వీరిద్దరూ ఏజెంట్లకు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ప్రసాద్‌ పాటిల్‌, హరిశ్చంద్ర షిండే, ప్రమోద్‌ పదాలె, అవివాష్‌ జైన్‌లుగా గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement