ఆడపిల్ల పుట్టిందని... | Mother for dumping newborn baby in hospital | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని...

Apr 20 2016 8:42 AM | Updated on Sep 3 2017 10:21 PM

ఆడపిల్ల పుట్టిందని...

ఆడపిల్ల పుట్టిందని...

పురిటి బిడ్డను ఆడపిల్ల అనే కారణంతో ఆస్పత్రిలోనే వదిలిలోనే కన్నతల్లి వదిలివేసిన సంఘటన తాలూకాలో చోటు చేసుకుంది...

పురిటి బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన తల్లి
పోలీసుల చొరవతో తిరిగి తల్లి ఒడి చేరిన చిన్నారి
 
దొడ్డబళ్లాపురం : పురిటి బిడ్డను ఆడపిల్ల అనే కారణంతో ఆస్పత్రిలోనే వదిలిలోనే కన్నతల్లి వదిలివేసిన సంఘటన తాలూకాలో చోటు చేసుకుంది, తాలూకాలోని మేలిన జూగానహళ్లి గ్రామానికి చెందిన పరమేశ్‌కు గౌరిబిదనూరు తాలూకా చిక్కనహళ్లికి చెందిన గౌరమ్మ కూతురు భాగ్యమ్మతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. గత నెల 31న భాగ్యమ్మ బెంగళూరులోని వాణివిలాస్ ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప కడుపులో సమస్య ఉందని చిన్న ఆపరేషన్ చేసిన వైద్యులు మరో పది, పదిహేను రోజులు అక్కడే ఉండి చికిత్స తీసుకోమన్నారు.
 
 అయితే పాపను డిశ్చార్జి చేసే రోజు ఆస్పత్రికి వచ్చిన భాగ్యమ్మ తన తల్లిమాట విని కన్నపేనుగు ఆస్పత్రిలోనే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆస్పత్రి వారిచ్చిన చిరునామా ఆధారంగా పాప తండ్రి పరమేశ్‌ను, అతని తల్లి లక్ష్మినరసమ్మను, పాప కన్న తల్లి భాగ్యమ్మను పిలిపించారు. ఆడపిల్లను వద్దనుకున్న భాగ్యమ్మ తొలుత ఆబిడ్డ తమది కాదని పోలీసులతో బుకాయించారు. బిడ్డను తీసికెళ్లడానికి ససేమిరా అన్నారు. అయితే పోలీసులు అతి కష్టం మీద తమదైన శైలిలో మాట్లాడి ఒప్పించి పాపను భాగ్యమ్మకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement