అరుళ్‌నిధికి జంటగా మోనాల్ | Monaj Gajjar joins Arulnidhi for Memories remake | Sakshi
Sakshi News home page

అరుళ్‌నిధికి జంటగా మోనాల్

Aug 28 2015 2:44 AM | Updated on Sep 3 2017 8:14 AM

అరుళ్‌నిధికి జంటగా మోనాల్

అరుళ్‌నిధికి జంటగా మోనాల్

చిన్న గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లో మెరవనుంది నటి మోనాల్. ఆ మధ్య వానవరాయనుమ్ వల్లవరాయనుమ్ చిత్రంలో కృష్ణ సరసన నటించిన

 చిన్న గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లో మెరవనుంది నటి మోనాల్. ఆ మధ్య వానవరాయనుమ్ వల్లవరాయనుమ్ చిత్రంలో కృష్ణ సరసన నటించిన ఈ మలయాళ బ్యూటీ తాజాగా నటుడు అరుళ్‌నిధితో రొమాన్స్ చేస్తోంది. ఇంతకుముందు డిమాంటి కాలనీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన తేనాండాళ్ ఫిలింస్ సంస్థ అదే చిత్ర హీరో అరుళ్‌నిధితో ఈ తాజా చిత్రాన్ని రూపొందనుంది. ఇది మలయాళ చిత్రం మెమొరీస్ చిత్రానికి రీమేక్.
 
 నటుడు పృథ్వీరాజ్ మరో ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటించే హీరోయిన్ కోసం ఒరిజినల్ చిత్రంలో నటించిన మియాజార్జ్ సహా పలువురు నటీమణులు పేర్లను పరిశీలించారు. చివరికి నటి మోనాల్ గజ్జర్‌కు ఈ అవకాశం వరించింది. దీని గురించి ఈ కేరళ కుట్టి తెలుపుతూ అరుల్‌నిధి సరసన తాను నటించనున్నట్లు చెప్పింది. చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 25 ప్రారంభం కానుందని అదే రోజు ఫొటోషూట్‌లో తాను పాల్గొననున్నానని తెలిపింది. ఈ చిత్రం ఒరిజినల్‌లో ఇద్దరు హీరోయిన్లు నటించారు. తమిళంలో మరో హీరోయిన్ కోసం నటి నిక్కి గల్రాణిని చిత్ర యూనిట్ అప్రోచ్ అయినట్లు తెలిసింది. అయితే ఆమె ఇంకా ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదని సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement