ఇన్నాళ్లూ టీవీ తెరపై మెరిసిన యువనటుడు మిశాల్ రహేజా దశ తిరిగింది. ప్రమోషన్ వచ్చేసింది. బడ్జెట్‌ట్రిప్ అనే సినిమాలో హీరోగా చాన్స్ సంపాదించాడు.
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ టీవీ తెరపై మెరిసిన యువనటుడు మిశాల్ రహేజా దశ తిరిగింది. ప్రమోషన్ వచ్చేసింది. బడ్జెట్‌ట్రిప్ అనే సినిమాలో హీరోగా చాన్స్ సంపాదించాడు. చేతన్ మొరాడా అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ఇక మిశాల్ లాగీ తుజ్‌సే లగన్ సీరియల్‌తో ప్రేక్షకులకు సుపరిచితుడు. తొలి సినిమా కాబట్టి కొంచెం కంగారుగానే ఉందని అంటున్నాడు. ‘దీని షూటింగ్‌కు దాదాపు మూడేళ్లు పట్టింది. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. అందుకే కంగారుగా ఉంది. రాబోయే రెండు మూడు నెలల్లో దీనిని విడుదల చేస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’ అని మిశాల్ వివరించాడు. న్యూయార్క్‌కు చెందిన ఖటేరా హకీమీ బడ్జెట్‌ట్రిప్‌లో హీరోయిన్. ఈమె ఇది వరకే ప్యార్ మే క్యూలో కనిపించింది. విజయ్‌రాజ్ కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. 2005లో ఎంటీవీలో ప్రసారమైన ప్యార్ వ్యార్ అండ్ ఆల్ దట్ షోతో మిశాల్ బుల్లితెరకు పరిచయమయ్యాడు.
అనురాగ్ బసు తీసిన లవ్‌స్టోరీలోనూ పాత్ర దక్కించుకున్నాడు. మిశాల్ బసుకు వీరాభిమాని. ఆయన సినిమాల్లో అవకాశం దక్కించుకోవడానికి ఏం చేసేందుకైనా సిద్ధమేనని కుండబద్దలు కొట్టాడు. సోనీ టీవీ ప్రసారమయ్యే ఎన్‌కౌంటర్ సీరియల్ మిశాల్ ఇక నుంచి పోలీసుగా కనిపిస్తాడు. గ్యాంగ్‌స్టర్ల నేరాల చుట్టూ ఎన్‌కౌంటర్ కథ తిరుగుతుంది. ‘ఇందులో కథనం విభిన్నంగా ఉంటుంది. మామూలుగా అయితే గ్యాంగ్‌స్టర్ దృక్కోణం నుంచి నుంచి కథ చెబుతారు. ఎన్‌కౌంటర్‌లో మాత్రం పోలీసుల దృక్కోణం నుంచి కథ మొదలవుతుంది. అతని కుటుంబం, నేపథ్యం గురించి కూడా వివరిస్తారు. పోరాటాలు, శృంగారం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఎన్‌కౌంటర్‌లో అవకాశం రావడం అద్భుతంగా అనిపిస్తోంది. మామూలు సీరియళ్ల మాదిరిగా కాకుండా, దీనిని కేవలం షూటింగ్‌ను స్వల్పకాలంలో ముగించాం’ అని రహేజా వివరించాడు.


