డెంటల్ పీజీ కోర్సుల ఫీజులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన
May 8 2017 11:54 AM | Updated on Nov 9 2018 4:46 PM
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డెంటల్ పీజీ కోర్సుల ఫీజులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం యూనివర్సిటీ ఎదుట మోకాళ్ళ పై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేస్తూ.. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులపై పెనుభారం మోపే ప్రయత్నాలను విరమించుకోకపోతే విద్యార్థుల నుంచి ప్రతిఘటన తప్పదని విద్యార్థి నేతలు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Advertisement